పులిగిల్లలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం


Sun,June 16, 2019 03:29 AM

ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పరకాల, నమస్తే తెలంగాణ : నడికూడ మండలంలోని పులిగిల్ల గ్రామంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పులిగిల్ల గ్రామంలో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచిన ప్రదేశానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. 42 నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్‌ చేసి, నిల్వ చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం ఉదయం వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఏడీఏ విద్యాసాగర్‌, ఏవో శ్రీనివాస్‌, ఏఈవోలు, వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం నకిలీ విత్తనాలుగా ధ్రువీకరించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏవో ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బేతు సమ్మయ్య, దద్దు రాజన్నపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎవరి దగ్గరినుంచి విత్తనాలను కొనుగోలు చేశారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. సరైన సమాచారాన్ని నిందితులు తెలపకపోవడంతో ఎవరి వద్ద నుంచి, ఎక్కడి నుంచి నకిలీ విత్తనాలు వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఈవోలు పవన్‌కల్యాణ్‌, గోపినాథ్‌, టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ తోట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...