ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం


Sun,June 16, 2019 03:29 AM

-సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడి
-రూ.80,955 రికవరీకి ఆదేశించిన అధికారులు
నర్సంపేట రూరల్‌, జూన్‌ 15 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు భారీగా దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడైంది. సంబంధిత ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీ, కంప్యూటర్‌ ఆపరేటర్ల నుంచి రూ. 80,955 రికవరీకి అధికారులు ఆదేశించారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత సంవత్సరం చేసిన పనులపై 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగింది. మండలంలోని 12 గ్రామాల్లో 2018మే నుంచి 2019 ఫిబ్రవరి వరకు రూ.2,97,36,851 విలువైన ఉపాధి హామీ పనులు జరిగాయి. వీటిపై గ్రామాల వారీగా ఇద్దరు ఎస్సార్పీలు, ఆరుగురు డీఆర్పీలు, మరో 20 మంది సామాజిక కార్యకర్తలు ఇటీవల 12 రోజులు ఆడిట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ప్రజావేదికలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామాల వారీగా జరిగిన పనుల్లో అక్రమాలను అధికారుల సమక్షంలో సామాజిక కార్యకర్తలు నిగ్గు తేల్చారు.

నిధుల రికవరీకి ఆదేశం..
సామాజిక తనిఖీ ప్రజావేదికలో దుర్వినియోగమైన ఉపాధి హామీ నిధులను వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా దుర్వినియోగమై నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాధన్నపేట గ్రామంలో ఎఫ్‌ఏ లక్ష్మీ రూ.15,043 నుంచి , టీఏ రవి రూ.5768, ఈసీ సతీశ్‌ రూ. 3000, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రాజు, నాగరాజు రూ.500, నాగుర్లపల్లిలో ఎఫ్‌ఏ జంపయ్య రూ. 8,435, టీఏ రవి రూ.3000, ఈసీ సతీశ్‌ రూ. 2000, ఇటుకాలపల్లిలో ఎఫ్‌ఏ ఎల్లయ్య రూ. 13,000, టీఏ సురేందర్‌ నుంచి రూ.1000 రికవరీ చేయాలని అధికారులు పేర్కొన్నారు. భాంజీపేటలోఎఫ్‌ఏ అనురాధ నుంచి రూ.328, టీఏ భద్రు రూ.704, ముత్తోజిపేటలో ఎఫ్‌ఏ ఎండీ అక్బర్‌, చందర్‌రెడ్డి రూ.5,220, టీఏ రవి రూ.1438, కమ్మపల్లిలో ఎఫ్‌ఏ శ్రీనుకు రూ. 1430, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నాగరాజుకు రూ. 909, మహేశ్వరంలో ఎఫ్‌ఏ సురేందర్‌, రాజు రూ.1,504, టీఏ భద్రు రూ.2457, రాజపల్లిలో ఎఫ్‌ఏ నర్ర నాగరాజుకు రూ. 3170, టీఏ వెంకటేశ్వర్లుకు రూ. 1000, రాజుపేటలో ఎఫ్‌ఏ రావూజీ రూ.2713, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నాగరాజు, రాజుకు రూ. 2304, లక్నెపల్లిలో టీఏ భద్రుకు రూ.500, దాసరిపల్లిలో ఎఫ్‌ఏ సారయ్యకు రూ. 500, చంద్రయ్యపల్లిలో ఎఫ్‌ఏ శ్రీనుకు రూ. 2,142, టీఏ భద్రుకు రూ.2,165, ఈసీ సతీశ్‌ రూ. 325, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నాగరాజు, రాజు నుంచి రూ.400 అధికారులు రికవరీకి ఆదేశించారు. మండల వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిలో మాధన్నపేట, ఇటుకాలపల్లి ఫీల్ట్‌అసిస్టెంట్లు ఉన్నారు. మండలంలో మొత్తం ఎఫ్‌ఏల నుంచి రూ. 53,485, ముగ్గురు టీఏల నుంచి రూ.18,032, ఈసీ సతీశ్‌ నుంచి రూ.5,325, కంప్యూటర్‌ ఆపరేటర్ల నుంచి రూ.4,113 కలిపి రూ.80,955 రికవరీకి ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ సీ రమేష్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారి నర్సింహారెడ్డి, జాయింట్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, డీవీసీ మాధవి ఆదేశించారు. ఈజీఎస్‌ ఏపీవో పాతిమామేరీ, ఈవోపీఆర్డీ అంబటి సునీల్‌కుమార్‌రాజ్‌, సూపరింటెండెంట్‌ రాధాకృష్ణారావు, సంతోశ్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, ఈసీలు సతీశ్‌, పూల్‌సింగ్‌, టీఏలు, ఎఫ్‌ఏలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...