సుర్రుమంటోంది..


Sat,June 15, 2019 02:43 AM

-దంచికొడుతున్న ఎండలు
-రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
-వారంలో అత్యధికంగా 46 డిగ్రీలు నమోదు
-వడదెబ్బతో ఒక్కరోజే ఆరుగురి మృతి
-బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న ప్రజలు
-అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
నర్సంపేట రూరల్, జూన్14 : సూర్య భగవానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లకల్లోలమవుతున్నారు. గడిచిన వారంలో అత్యధికంగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది. శుక్రవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40, కనిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బతో ఆరుగురు మృతి చెందారు. మండుతున్న ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడి ప్రతాపానికి పలు గ్రామాల్లో ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. గత ఏడాది కంటే ఈఏడాది రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత ఏడాది మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, జూన్ నెలలో 38 డిగ్రీలు నమోదు కాగా.. ఈ ఏడాది 46 డిగ్రీల పైచిలుకు పెరుగడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత మరింత పెరగడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని, వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గత ఏప్రిల్ నెల చివరి నుంచి ఎండలు మరింత మండి పోతున్నాయి.

గత నెల కన్నా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపో యి ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటాయి. ఉదయం 8గంటలకే ఎండలు మండిపోతున్నాయి. గత వారం పది రోజులుగా ఉ ష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతకు తోడు వడగాలులు తోడవడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉపాధి కూలీలు, రోజు వారి కూలి ప ని చేసుకుని జీవించే వారు, ఉద్యోగులు వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వడదెబ్బకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. పది హేను రోజులుగా వడదెబ్బబారిన పడి సుమారు 50 మందిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వందలాది జీవాలు మరణించాయి. వడదెబ్బ బారిన పడి దవాఖానల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతలపానీయాలను సేవిస్తున్నారు. ఎండలో పని చేసేవారు, తిరిగే వారు, వృద్ధులు, మ ద్యం సేవించే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశముంద ని వైద్యులు అంటున్నారు. ఎండల బారి నుంచి రక్షణ పొందాలం టే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..
వడదెబ్బతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఎక్కువగా వడదెబ్బకు గుర య్యే ప్రమాదం ఉంటుంది. ఎండల ప్రభావంతోనే ప్రతి ఏటా ప్ర జలు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ఎండలో పని చేసే వారు, తిరిగే వారు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. శరీర ఉ ష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్ర మాదం ఉంది. వేసవి కాలంలో రైతులు పశువుల పోషణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో పోషణ లో కొద్దిగా నిర్లక్ష్యం వహించినా పాల ఉత్పత్తిలో భారీ తగ్గుదలతో పాటు పశువులు మృత్యువాతకు గురయ్యే ప్రమాదం ఉంది.

జాడలేని వర్షాలు..
జూన్ ప్రారంభమై 15రోజులు దాటినా నేటికీ వర్షాల జాడ కన్పించడం లేదు. మృగశిరకార్తె గత శనివారం ప్రారంభమైంది. మృగశిరకార్తె ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా వర్షాలు కనుచూపు మేర కన్పించడం లేదు. ఇప్పటి వరకు 15 రోజులకు పైగా కాలం వెనక్కిపోయిందని రైతులు అంటున్నారు. గత సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు కురిసి చెరువులు 30 శాతం నిండాయి. పత్తి గింజలు మొలకలు వచ్చాయని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చెరువులు, బావులు, కుంటల్లో భూగర్భజలాలు అడుగంటాయి. గతంలో బావులు కింద నార్లు పోసుకున్నామని, నేడు వర్షం జాడలేదని రైతులు పేర్కొంటున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...