వైద్యులపై దాడులను అరికట్టాలి


Sat,June 15, 2019 02:42 AM

-ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి
- ఎమ్మెల్యే పెద్దికి వినతిపత్రం అందజేత
- ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి
- ఎమ్మెల్యే పెద్దికి వినతిపత్రం అందజేత
నర్సంపేట, నమస్తేతెలంగాణ : వైద్యులపై దాడులను అరికట్టాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి కోరారు. శుక్రవారం నర్సంపేటలో ఐఎంఏ ఆధ్వర్యంలో రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి, ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇటీవల వరంగల్‌లో వైద్యుడిపై అకారణంగా దాడి చేసి సామగ్రీని ధ్వంసం చేశారని అన్నారు. ఇలా పక్క రాష్ట్రంలోనూ వైద్యుడిపై దాడి చేశారన్నారు. ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులపై కూడా దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలని కోరారు. రోగులు చికిత్సకు వచ్చే సమయంలో ఎలాంటి గొడవలు ఉండవని, అనుకోని పరిస్థితిలో రోగి చనిపోతే మధ్యవర్తులు కల్పించుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. రోజురోజుకు ఇలాంటి దాడులు చేయడం వల్ల వైద్య చికిత్సలు అందించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రులకు, నర్సింగ్‌హోంలకు తగు విధంగా రక్షణను కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద ఈ రోజు ఆస్పత్రులు బంద్ చేసి ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారని అన్నారు. దీనిలో భాగంగానే నర్సంపేటలో నిరసన కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మోహన్‌రావు, రాజేశ్వర్‌రావు, కిరణ్, జయుడు, మోహన్‌లాల్, విరీన్, రవికిరణ్, కిషన్, భారతి, నవత, సుజాతారాణి, ఉజ్వల, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...