పిట్టలు రాలుతున్నయ్..!


Sat,June 15, 2019 02:41 AM

శాయంపేట : వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రజలనే కాదు పశుపక్ష్యాదులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎండ వేడికి తాళలేక ప్రాణాలను వదులుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నైరుతితో వానలు పడి చల్లబడాల్సిన వాతావరణం ఇంకా వేడిగానే ఉన్నది. భానుడు ఏమాత్రం చల్లబడకుండా భగభగ మండిపోతూనే ఉన్నాడు. శుక్రవారం జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈక్రమంలో ఎండ వేడిమికి తాళలేక పక్షులు ప్రాణాలు వదులుతున్నాయి. శాయంపేటకు వెళ్లే దారిలో నడిరోడ్డుపై పిట్ట భానుడి ప్రతాపానికి ప్రాణాలు వదిలేసింది. సాధారణంగా జూన్ రెండో వారంలో వాతావరణం అంతా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాలు పడి విత్తనాలు విత్తి రైతులు నీళ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఇదే సమయానికి విత్తనాలు పెట్టామని రైతులు గుర్తు చేస్తున్నారు. మరికొద్ది రోజులు ఎండలు తీవ్రంగానే ఉంటాయని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. నైరుతు రుతుపవనాలు ఆలస్యం అవుతాయని చెబుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మరి వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని రైతులు కోరుతున్నారు

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...