ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించాలి


Sat,June 15, 2019 02:41 AM

-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలి
-ఎర్రబెల్లి ట్రస్టు చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు
రాయపర్తి, జూన్ 14 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిలే లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న ప్రభుత్వ ఫలాలను మండలంలోని అన్ని గ్రామాల్లోని అర్హులైన వారందరి కీ చేర్చేందుకు ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నా యకులు సంసిద్దులుగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్టు చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రా బోయే కొద్ది రోజుల్లోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లు రాకెట్ వేగంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో నూతనంగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నేతలంద రూ తమ తమ గ్రామాలు, ఆవాసాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజల హృదయాలలో సు స్థిర స్థ్ధానంతోపాటు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాల్సిందిగా ఆమె సూచించారు. పాలకుర్తి నియోజక వర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, పల్లెల అభివృద్ధి విషయంలో నిధులకు ఎటువంటి కొరత, ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండల తో మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండల అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని ఆమె వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్ర తినిధులందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతంతోపాటు ప్రజల సంక్షేమానికి కృషి చేయాల్సిందిగా ఆమె కోరారు. పార్టీ విషయంలో క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

వాటర్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలం పరిశీలన..
మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో నిర్మాణం లో ఉన్న బస్టాండ్ పనులను ఆమె పార్టీ మండల నా యకులతో కలసి క్షేత్రాస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్ నిర్మాణ పనులలో నాణ్యాతా ప్ర మాణాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా ఆమె సూచించారు. బస్టాండ్ ఆవరణలో బాలవికాస స్వచ్ఛంద సం స్థ సహకారంతో మంత్రి ఎర్రబెల్లి ప్రోద్బలంతో నిర్మించనున్న ఎనీటైం వాటర్ మిషన్ ప్రతిపాదిత స్థల పరిశీలన జరిపిన ఆమె పలు సూచనలు చేశా రు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీలు రంగు కుమార్, వంగాల యాకమ్మ, మం డల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, మండల నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, గారె నర్సయ్య, కాంచనపల్లి వనజారాణి, పంతంగి నర్స య్య, జాజునాయక్, నయీం, కోటేశ్వర్, కాశీనాథం, బొమ్మెర వీరస్వామి, ఆకారపు వెంకటాచారి, చిన్నాల కిషన్‌యాద వ్, భాషబోయిన సుధాకర్‌యాదవ్, కోదాటి దయాకర్‌రావు, కర్ర రవీందర్‌రెడ్డి, ఎండీ ఉస్మాన్, లేతాకుల యాదవరెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, బోనగిరి ఎల్ల య్య, భధ్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...