ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించాలి


Sat,June 15, 2019 02:40 AM

డిప్యూటీ డీఎంహెచ్‌వో మహేంద్రన్
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మహేంద్రన్ సూచించారు. శుక్రవారం జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో హన్మకొండలోని జీఎంహెచ్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేంద్రన్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో టీబీ రోగులను తెమడ పరీక్ష ద్వారా గుర్తించాలని అన్నారు. పాజిటివ్ కేసులు నమోదైతే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు ప్రతీ నెల ప్రభుత్వం అందించే మందులను అందజేస్తూ వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రతీ ఆస్పత్రిలో ప్రసవాలు జరగాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని అన్నారు. ఓపీ సేవలను సక్రమంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఎంవో డాక్టర్ స్వరూపారాణి, అర్చన, రాజు, అహల్య, వైద్యాధికారులు, సీహెచ్‌సీ సూపర్‌వైజర్లు, ఆశ నోడల్ పర్సన్స్ పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...