రక్తదానం ప్రాణదానంతో సమానం


Sat,June 15, 2019 02:40 AM

-డీఆర్డీవో సంపత్‌రావు
-సంగెంలో 107 మంది రక్తదానం
సంగెం, జూన్ 14 : రక్తదానం ప్రాణదానంతో సమానమని డీఆర్డీవో సంపత్‌రావు అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రెడ్‌క్రాస్ సొసైటీ మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంపత్‌రావు మాట్లాడుతూ.. రక్తదానం చేయటం అభినందనీయమని అన్నారు. ఎన్ని యంత్రాలు సృష్టించుకున్నా, ఎన్ని కృత్రిమ అవయవాలు రూపొందించుకున్నా రక్తాన్ని తయారు చేయలేకపోతున్న తరుణంలో రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మానవ శరీరంలో తయారు కాబడే అరుదైన ప్రాణదాయణి రక్తమని అన్నారు. రక్తదానం చేసిన ప్రాణదాతలుగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 18 సార్లు రక్తదానం చేసిన సంగెం ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్‌ను డీఆర్డీవో అభినందించారు.

అలాగే మండలంవలోని పలు గ్రామాలకు చెందిన 107 మంది రక్తదానం చేశారు. వారందరకి ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. రాంచంద్రాపురం గ్రామానికి చెందిన 36 మంది యువజన సంఘాల సభ్యులు రక్తదానంలో పాల్గొనటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్. మల్లేశం, ఈవోపీఆర్డీ రోజారాణి, ఏపీవో శారద, ఏపీఎం కిషన్, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ కందకట్ల కళావతి, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు నరహరి, బోంపెల్లి దిలీప్‌రావు,ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...