గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం


Sat,June 15, 2019 02:40 AM

గీసుగొండ, జూన్14 : మండలం కేంద్రం నుంచి మనుగొండ ఎలుకుర్తి మీదుగా ఆర్ట్టీసీ బస్సు సర్వీస్‌ను నడుపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సరస్వతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు ఆర్టీసీ సర్వీసును ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోజుకు నాలుగు ట్రిప్‌లను ఈగ్రామాల మీదగా బస్సులను నడిపిస్తామన్నారు. ముఖ్యంగా విద్యార్థులతోపాటు వికలాంగుల కోసం సర్వీసును నడిపిస్తున్నట్లు తెలిపారు.

గంగదేవిపల్లిలో ఉచిత బస్‌పాస్‌ల పంపిణీ
మండంలోని గంగదేవిపల్లి గ్రామంలో నర్సంపేట డిపో మేనేజన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, వికలాంగులకు ఉచిత బస్‌పాసులను అందించారు. ప్రతీ ఒక్కరు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని మేనేజర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీనివాస్, సర్పంచ్ దౌడుబాబు, మల్లయ్య, రమా, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...