గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి


Fri,June 14, 2019 03:36 AM

వర్ధన్నపేట, నమస్తే తెలగాణ, జూన్ 13 : ప్రజలు ప్రభుత్వంపై పెంచుకున్న నమ్మకానికి తగినట్లుగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన ఎంపీటీసీలతో కలిసి ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీపీ రవీందర్‌రావులను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రజలంతా స్థానిక సంస్థలు, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేసినా భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావలసి వస్తుందని చెప్పారు. అందుకని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాలలో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయనున్నదని చెప్పారు. ఈ నిధులతో గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అలాగే తమకు పార్టీ టికెట్‌లు ఇచ్చి ఎంపీటీసీలు, ఎంపీపీగా, జెడ్పీటీసీగా గెలిచేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీపీ రవీందర్‌రావులకు ఎంపీటీసీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మీ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...