కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


Fri,June 14, 2019 03:35 AM

రాయపర్తి, జూన్ 13: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన విలేకరులతో మాటాడారు. ఈ నెలాకరు వరకు మాత్రమే కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సులలో తరగతులు నిర్వహించేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడంతోపాటు కళాశాల, పరీక్షా ఫీజులను చెల్లింస్తున్నట్లు వివిరంచారు. అంతేగాక బస్‌పాస్, ఉపకార వేతనాల సౌకర్యాలు సైతం అందుబాటులో ఉన్నందున మండలంలోని అన్ని గ్రామాల్లో పదవ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత చదువుల కోసం జీజేసీలోనే చేరాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక బృందం ప్రభాకర్, రాజిరెడ్డి, రామూర్తి, గీత, మాధవి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...