అభివృద్ధిలో అండగా ఉంటా..


Fri,June 14, 2019 03:33 AM

నెక్కొండ, జూన్12 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంత వాసిగా అండగా నిలుస్తానని సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్ అన్నారు. గురువారం నెక్కొండ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ సారంగపాణి, తాజా వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం,సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మండల నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్ తదితరులు పీఆర్వోను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్‌వో విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సమష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారంలోసహకారం అందిస్తానని హామీనిచ్చారు. పీఆర్‌వో విజయ్‌కుమార్‌ను కలిసిన వారిలో వాగ్యానాయక్ తండా సర్పంచ్ ్య హరికిషన్, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, కొమ్ము రాజు, నాయకులు శ్రీకాంత్, మాధవ్, రఫీ పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...