ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి


Fri,June 14, 2019 03:33 AM

చెన్నారావుపేట, జూన్13 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంపీడీవో కొర్ని చందర్, ఎంఈవో నక్క విజయ్‌కుమార్ గురువారం మండల ప్ర జాపరిషత్ కార్యాలయంలో హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచి పా ఠశాలలను బలోపేతం చేయాలన్నారు. అలాగే, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు. హరితహారంలో భాగం గా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటించాలన్నారు. ప్రతీ విద్యార్థికి తప్పకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, హెల్త్‌కిట్ అందించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు సరళ, ఫ్లోరెన్స్, కుమారస్వామి, మల్లయ్య, పవనకుమారి, రజిత, రమేశ్, వెంకన్న, వెంకటశ్రీనివాస్, కట్టస్వామి, మంజులరాణి, సుష్మ, లక్ష్మణ్, నర్సింగరావు, సీఆర్‌పీ సంపత్ పాల్గొన్నారు.
నెక్కొండ : నెక్కొండలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంఈవో రత్నమాల మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా హెచ్‌ఎంలు కృషిచేయాలని కోరారు. సమావేశంలో హెచ్‌ఎంలు రంగారావు, శ్రవణ్‌కుమార్, జ్యోతిలక్ష్మి, మణెమ్మ, మల్‌సూర్, ఉదయ శ్రీ , ఎంఐఎస్ కోఆర్డినేటర్ కార్తీక్, దేవేందర్, రమేశ్, లావణ్య పాల్గొన్నారు.

సూరిపల్లిలో బడిబాట
నెక్కొండ మండలం సూరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుజన్‌తేజ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. బడిబాట కరపత్రాలను ఎస్‌ఎంసీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారపు గీత, ఎస్‌ఎంసీ చైర్మన్ భాస్కర్, ఉప సర్పంచ్ అయిలయ్య పాల్గొన్నారు.
ఖానాపురం : మండలంలోని మంగళవారిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావుడ్య రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ అయిలయ్య, ఉపాధ్యాయులు దేవేందర్, కీర్య, సబియ, రమేశ్, రాజు, సునీత, సుధాకర్, కమల్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...