భూమికి హక్కులు కల్పించాలి


Wed,June 12, 2019 02:24 AM

రాయపర్తి, జూన్11: తాతా, తండ్రులు సంపాదించిన వ్యవసాయ భూముల్లో హక్కులు కల్పించకుండా కుటుంబ సభ్యులు, రెవెన్యూ యంత్రాం గం తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని జయరాంతండాకు చెందిన గుగులోతు శ్రీలత జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు స్థానిక విలేకరులకు తెలిపారు. మంగళవారం మండల కేం ద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె తన మేనమామ బానోతు కిషన్‌నాయక్‌తో కలిసి తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనకు ఏడాది వయసున్నప్పుడు 2002లో తన తండ్రి విద్యుత్ ప్రమాదంలో మృత్యువాతపడగా తల్లికి రెండో పెండ్లిచేసి పంపించినట్లు చెప్పారు. ఈ క్రమంలో తన తాత, తండ్రి సంపాదించిన స్థిర, చర ఆస్తులను కూతురు అయిన శ్రీలతకు చెందాలంటూ ఆనాడు పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహించి ఒప్పందాలు చేసినట్లు వివరించారు. కానీ, తాను ప్రస్తుతం మేజర్ అయినందున ఆస్తిలో హక్కులు కల్పించాలంటూ రెవెన్యూ అధికారులను కలుస్తున్నప్పటికీ తమ కుటుంబ సభ్యుల (బాబాయి, పిన్ని తదితరులు) ప్రలోభాల కారణంగా తనను పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే రెవెన్యూ యంత్రాంగం స్పందించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. లేనిపక్షంలో తన ఆందోళన ఉధ్రుతం చేయనున్నట్లు శ్రీలత వివరించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...