నేటి నుంచి బడి బస్సులు తనిఖీ


Wed,June 12, 2019 02:23 AM

-డీటీవో కంచి వేణు
ఖిలావరంగల్, జూన్ 11: పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా బడి బస్సులను తనిఖీ చేపడుతామని రూరల్ జిల్లా డీటీవో, అర్బన్ జిల్లా ఎంవీఐ కంచి వేణు అన్నారు. మంగళవారం రంగశాయిపేట రవాణాశాఖ కార్యాలయంలో బడి బస్సులకు సామర్థ్ధ్యం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ అర్బన్ జిల్లాలో 1057 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఉండగా 657 బస్సులు మాత్రమే సామర్థ్ధ్యం పరీక్షలకు వచ్చాయన్నారు. ఇందులో 44 బస్సులకు లోపాలు ఉండడంతో వాటిని తిరస్కరించి నోటీసులు ఇచ్చామన్నారు. మిగతా 444 బస్సులు సామర్థ్యం పరీక్షలకు రావాల్సి ఉందన్నారు. అలాగే రూరల్ జిల్లాలో 339 విద్యాసంస్థల బస్సులున్నాయన్నారు. ఇప్పటి వరకు 229 బస్సులు మాత్రమే సామర్థ్యం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం నుంచి వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో విస్తృత తనిఖీ చేపడుతున్నామన్నారు. కాలం చెల్లిన బస్సులు లేదా సామర్థ్యం పరీక్షలకు రాని బస్సులు రోడ్ల మీదికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రమాద రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల వాహనాలను ఎక్కించేటప్పుడు బస్సు స్థితిగతులను గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రమేశ్ రాథోడ్, ఏఎంవీఐలు ఫహిమా సుల్తాన, మాధవి, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. చేశారు. దీంతో శాశ్వత ఏర్పాట్లు చేసేందుకు సమయం కలిసివచ్చింది.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...