అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి


Wed,June 12, 2019 02:22 AM

-నర్సంపేట ఏసీపీ సునీతామోహన్
ఖానాపురం, జూన్11: విధినిర్వహనలో అంకితభావంతో పని చేయాలని ఏసీపీ సునీతామోహన్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందికి మంగళవారం ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సునీతామోహన్ మాట్లాడుతూ ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ ప్రజల్లో పోలీస్‌లపై ఉన్న భయాన్ని పోగొట్టాలన్నారు. బాధితులు స్వేచ్ఛగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సేవలను విస్త్రృత పర్చాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సతీష్‌బాబు, హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...