44 డిగ్రీల నరకం..


Mon,May 27, 2019 01:57 AM

- నిప్పులు కక్కిన భానుడు
- గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం విలవిల
- తీవ్రమవుతున్న వడగాలులు
- బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు
- పెరుగుతున్న వడదెబ్బ మృతులు

శాయంపేట, మే 26 : గతంలో ఎన్నడూ లేనంత ఎండలు మండిపోతున్నాయి. సూరీడు సుర్రుమంటుండటంతో జనం బేజారవుతున్నారు. సాధారణంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతకే జనం ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాంటిది ఆదివారం ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. దీంతో జనం కుతకుతలాడుతూ కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. గ్రామీణ ప్రాం తాల్లోని జనం దంచికొడుతున్న ఎండలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో ఇంతటి ఎండలను ఎన్నడూ చూడలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. 41 డిగ్రీల నుంచి 44డిగ్రీలకు పెరగడంతో బయటకు జనం రాలేకపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఎండ తీవ్రత, వడ గాలులు వీస్తుండటంతో ప్రమాద పరిస్థితులున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఉదయం 8 గంటలకే ఎండ మండిపోతుండటంతో పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలైతే చాలు జనం బయటకు రావడానికి వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే తప్పా ఎండలో బయటకు రాలేకపోతున్నామని పలువురు చెబుతున్నారు. శుభకార్యాలున్నా ఎండల వల్ల వెళ్లలేని పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు.

గత కొన్నేండ్లల్లో ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు అంటున్నారు. ఆదివారం మధ్యాహ్నాం 1 గంటలకు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయింది. ఎండలో బయట తిరగడం దేవుడెరుగు కానీ ఇంట్లో ఉన్నా ఉక్కపోత, ఉబ్బరింతతో అవస్థలు పడాల్సి వస్తుందని జనం వాపోతున్నారు. దీనికి తోడు వడగాలులతో తప్పని సరిగా కూలర్ల వద్ద కూర్చోవాల్సి వస్తున్నందంటున్నారు. అయినా వేడి గాలి వస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు. ఇంట్లో ఉన్నా ఎండకు భగ్గుమంటుండటంతో ఇంకా ఎన్నిరోజులు దేవుడా..? అంటూ నిట్టూరుస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల మ రింత అవస్థలు పడుతున్నారు. సాధారణంగా ఎడారిలో అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకే ఉంటాయి. అలాంటిది జనావాసాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పెరగడంపై విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి క్రమంగా 34 డిగ్రీల నుంచి 44 డిగ్రీలు దాటుతుండటంతో ఏం చేయాలో అయోమయంలో పడుతున్నట్లు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో 11 గంటలు కాగా నే రోడ్లన్ని ఖాళీగా మారుతున్నట్లు చెబుతున్నారు. రోడ్లు బోసిపోయి ఉంటున్నాయని మళ్లీ సూరీడు వెళ్లిపోయాకనే బయటకు వస్తున్నట్లు చెబుతున్నారు. సాయంత్రం అయినా ఉక్కపోత, ఉబ్బరింతతో జనం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఆలస్యంగా వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో మరికొన్ని రోజులు ఎండలు దంచికొట్టే పరిస్థితులు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఎండలు తగ్గేదెప్పుడు తమకు ఉపశమనం కలిగేదెప్పుడు అని దేవున్ని జనం వేడుకుంటున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...