నిరుపేద ముస్లింలకు సర్కారు కానుక


Mon,May 27, 2019 01:56 AM

వరంగల్ రూరల్ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : సర్వమతాల సమానత్వం.. అన్ని మతాచారాలను వారివారి అభిష్టాలను గౌవరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మతం ఏదైనా ఆయా మతాల్లోని నిరుపేదలు ఆనందంగా పండగలను జరుపుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని మతాచారాలకు అనుగుణంగా ఆయా మతాలకు సంబంధించిన పండుగలకు కావాల్సిన దుస్తులను వ స్తు సామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తూ పేదల కళ్లల్లో పండుగరోజు ఆనందం కనిపించేలా కార్యాచరణను అమలు చేస్తూ అన్నిమతాల్లోని నిరుపేదల అభిమానాన్ని చురగొంటున్నది. అధికారంలోకి వచ్చిన నాటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యాచరణను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగానే రంజాన్ సందర్భంగా ముస్లింలకు క్రిస్టమస్ సందర్భంగా క్రిష్టియన్లకు కావాల్సి న దుస్తువులను పండుగల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు, సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భా గంగానే వచ్చేనెల 5వతేదీన రంజాన్ పండుగను పురస్కరించుకొని వరంగల్‌రూరల్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖతో పాటుగా జిల్లా మైనార్టీ అధికారు లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే ఇఫ్తార్ విందులకు స్థానిక శాస న సభ్యు లు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై వారి తో పాల్గొనేలా కార్యాచరణలు సిద్ధం చేశారు.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలకు కూడా హాజరుకావడం మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనే ప్రభుత్వ సూచన మేరకు అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఏర్పా ట్లు చేస్తున్నది.

ఈ రంజాన్ మా సం కొనసాగుతుండగా ప్రభు త్వం ఇప్పటికే జిల్లాలోని మూడు శాసనసభా నియోజక వర్గాల్లోని 401 గ్రామపంచాయతీలు వీలిన గ్రామాలు, వార్డులను కలుపుకొని 4500 మంది నిరుపేద ముస్లింలు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రతీ నియోజకవర్గంలో 1500 మంది నిరుపేద ముస్లింలు మొత్తం జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో 4500 మందికి గిఫ్ట్‌ప్యాక్‌లను అందించాలని నిర్ణయించారు. వీరికి అందించే ప్రత్యేక గిఫ్ట్‌ప్యాక్‌లు ఇప్పటికే జిల్లాలోని మసీదులకు జిల్లాకేంద్రంలోని గిడ్డంగులకు చేరుకున్నాయి. మసీద్ కమిటీల ద్వారా వీటిని అధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని కూడా నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాలోని శాసనసభా నియోజక వార్గాల వారీగా నిధులను కూడా కేటాయించింది. మసీద్‌కు రూ. ఒక లక్ష చొప్పున ప్రతీ నియోజక వర్గానికి రూ.3 లక్షలు మొత్తం జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల శాసన సభానియోజక వర్గాలకు మొత్తంగా రూ.9లక్షల నిధులను కేటాయింది. ప్రభుత్వం ఈ నిధులను కూడా విడుదల చేయడంతో రంజాన్ మాసానికి సంబంధించిన గిఫ్ట్‌ప్యాక్‌లు, ఇప్తార్ విందుకు నిధులను కేటాయించడం తోపాటుగా అధికారులు చకాచకా ఏర్పాట్లు చేయడంపై జిల్లాలోని మజీద్ కమిటీలు, ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

30లోగా పంపిణీ..
జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజక వర్గాలోని నిరుపేద ముస్లింల కోసం మంజూరు చేసిన 4500 గిఫ్ట్ ప్యాక్‌లను ఈ నెల 30వ తేదీలోగా పంపిణీ చేయనున్నారు. జి ల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ గిఫ్ట్ ప్యాక్‌లను అం దిచేలా చర్చలు తీసుకుంటున్నారు. ఆయా నియోజక వర్గాల్లో స్థ్ధానిక శాసన సభ్యుల సమయం తీసుకొని వారికి గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది.

గిఫ్ట్ ప్యాక్‌ల్లో..
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందించి ప్రత్యేక గిఫ్ట్‌ప్యాక్‌ల్లో వారి అవసరాలను గుర్తించి అం దించే పండుగపూట వారు నూతన వస్ర్తాలను దరించాలని భావించింది. ఈ మేరకు ఖరీదైన దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌ను తయారు చేయించి అందిస్తున్నది. ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ప్యాంట్, షర్ట్, చీర, జాకెట్‌తోపాటుగా సర్టు, చున్నీ, బాటం (లెగిన్)లు ఉంటాయి. ఈ ప్యాక్‌లను పేరెన్నికగన్న కంపెనీలతో రూపొందించిన గిఫ్ట్ కావడంతో ప్రతీ రంజాన్ వచ్చిందంటే ప్రభుత్వం అం దించే గిఫ్ట్‌ప్యాక్‌లో ఉంటాయని నిరుపేద ముస్లిం కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం...
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లను వేగవంతంగా చేస్తున్నాం. జిల్లాలో మసీద్ కమిటీల ద్వారా గుర్తించిన 4500 మంది నిరుపేద ముస్ల్లింలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తాం. ఈ మేరకు తహసీల్దార్లకు మైనార్టీశాఖను ఆదేశించాం. రంజాన్ సందర్బంగా ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటుకు ప్రభుత్వం నియోజక వర్గానికి రూ.3 లక్షల చొప్పున జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు గానూ రూ.9లక్షలు కేటాయించింది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.
- మహేందర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్

మహ్మదీయుల మనస్సు గెలిచిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాల ఉన్నతి కోసం అహర్నిషలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు ఇస్లాం సమాజానికి అల్లా పంపిన దేవదూత. సీఎం కేసీఆర్ ఏలుబడిలోనే రాష్ట్రంలోని ముస్ల్లిం కుటుంబాలకు సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తున్నది. షాదీ ముభారక్ పేరిట పేద ముస్లిం ఇళ్లల్లో వెలుగు నింప్పారు. గత ప్రభుత్వాలు ముస్లింలను కేవ లం ఓటు బ్యాంకులుగానే పరిగణించేవి. కానీ నేడు కేసీఆర్ మహ్మదీయుల మనస్సులను గెలుచుకుంటున్నాడు.
- మహ్మద్ యాసీఫ్‌పాషా, రాయపర్తి


పాత రోజులు గుర్తుకు వస్తే పాణం తల్లడిల్లుతది
ఎనుకటి రోజుల (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం)లో ముస్లింలను ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. మా ప విత్ర రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు పండుగెట్ల జరుపుకోవాల్నో అర్ధం కాక పాణం నిమ్మలమయ్యేది కాదు. కానీ కేసీఆర్ సారు వచ్చినంక మసీదులు, ముస్ల్లింల అభివృద్ది కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో ఆనంధంగా పండుగ జరుపుకుంటున్నాం. ప్రభుత్వమే పండుగ నిర్వహిస్తూ ఇఫ్తార్ విందులు, దుస్తులు పంపిణీ చేస్తూ మా హృదయాలను గెలుచుకుంటున్నది.
- మహ్మద్ గౌసియాబేగం, రాయపర్తి

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్‌ను అందించడం హర్షించదగ్గ విష యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. అన్ని పండులను ఆదరిస్తు ప్రజలకు అండగా ఉంటున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కృతజతలు. ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్‌లు పేద ముస్లింలకు వరం లాంటిది. గిఫ్ట్‌లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
- ఎస్‌కే గౌస్, కాట్రపల్లి

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...