గులాబీ కంచుకోట


Sat,May 25, 2019 03:08 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ: ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఓరుగల్లు అండగా ఉంది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి వెన్నంటి ఉంటోంది. టీఆర్‌ఎస్ అంటే వరంగల్.. వరంగల్ అంటే టీఆర్‌ఎస్‌గా ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రస్థానంలో సుస్థిర స్థానాన్ని పదిల పరచుకుంటూనే ఉంది. 2004 సాధారణ ఎన్నికల నుంచి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల దాకా అదే స్ఫూర్తిని నిలుపుకున్నది. రాష్ట్రంలోని జిల్లాలతో పోలిస్తే ఓరుగల్లు విలక్షణ తీర్పు ఇస్తోంది. సాధారణ ఎన్నికలేకాకుండా, ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో పసునూరి దయాకర్, మాలోత్ కవిత భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమన్వయంతో ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా నిలిచి భారీ మెజార్టీ తీసుకొచ్చారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...