ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం


Sat,May 25, 2019 03:03 AM

రాయపర్తి, మే 24 : మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ విద్యార్థులను చేర్పించాలని మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అజ్మీరా ఉమాదేవి కోరారు. శుక్రవారం పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోరుతూ ఉపాధ్యాయులతో కలిసి ఆమె మం డల కేంద్రంలోని మాల వాడ, ముస్లిం కాలనీ, రజక వీధి, కోతులోరి చింత, బెస్తవాడ, యాదవుల కాలనీల్లో బడిబాట ప్రచార ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ప్రభుత్వం అ నేక వసతులు, సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తున్నట్లు వివరించారు. ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నిష్ణాణుతులైన ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాలను వినియోగించుకునేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ పాఠశాలల్లోనే చేర్పించాల్సిందిగా ఆమె కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్‌రావు, ప్రవీణ్‌రె డ్డి, విక్రంకుమార్, ప్రవీణ్‌కుమార్, విజయ తదితరులున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...