అంతా టీఆర్‌ఎస్ వెంటే 50శాతానికిపైగా దయాకర్‌కు పోలైన ఓట్లు


Sat,May 25, 2019 03:03 AM

పరకాల, నమస్తే తెలంగాణ : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే నిలిచారు. పరకాల, న డికూడ మండలాలతోపాటు పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఓట ర్లు తమ ఓటు హక్కును టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు వేసి ఆయన గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఎన్నికల్లో పోలైన ఓట్లలో పరకాల మండలంలో 50శాతం, నడికూడ మండలంలో 55.43, పరకాల మున్సిపాలిటీ పరిధిలో 49శాతం టీఆర్‌ఎస్ అభ్య ర్థి, ఎంపీ దయాకర్ ఓట్లను పొందారు. పరకాల మండలంలో రెం డు మూడు గ్రామాల్లో మినహా మిగతా అన్నిగ్రామాల్లో ఎంపీ ద యాకర్ మెజార్టీ సాధించారు. పరకాల మండలంలో 10,069 ఓ ట్లు పోలవగా ఎంపీ దయాకర్ 5,030 ఓట్లను సాధించారు. నడికూడ మండలంలో 19,007 ఓట్లు పోలవగా 10,535 ఓట్లు, పరకాల మున్సిపాలిటీ పరిధిలో 15,772 ఓట్లుకు 7,830 ఓట్లను సాధించారు. ఆయా మండలాల్లో ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ టీఆర్‌ఎస్‌కే అధికంగా పోల్ అయ్యాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే దయాకర్ గెలుపు తప్పనిసరి అని భావించి ఓటర్లంతా దయన్నకు జై కొట్టారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...