ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌ను


Sat,May 25, 2019 03:02 AM

-పకడ్బందీగా నిర్వహించాలి
ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం హరిత
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌ను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం హరిత ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్ నుంచి ఎం పీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టేబుల్స్ వారీగా కౌంటింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో భారీ కేడ్లు, టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నందున అన్ని కేంద్రాలకు 24గంటల విద్యుత్ సరఫరా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూ చించారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి పాస్‌లు ఇవ్వాలని చెప్పారు. కౌంటింగ్ కేం ద్రాల్లో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్లను ఏర్పాటు చేసి ఎల్‌సీడీలు ఏర్పాటు చే యడంతోపాటు వివరాలను సకాలంలో అందే లా సిబ్బంది ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ హాల్ వద్ద పూర్తి వివరాలతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల బయట జెడ్పీటీసీ లు, ఎంపీటీసీల కోసం టెం ట్లు ఏర్పాటు చేయాలని చెప్పా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో హరిసింగ్, డీఆర్డీవో సంపత్, అధికారులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...