కేశవాపురంలో పూజలు


Sat,May 25, 2019 03:01 AM

దుగ్గొండి : కేశవాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో త్రయోదశ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిత్యారాధనం, మహాకుంభస్థాపన, అగ్నిప్రతిష్ఠ, ద్వజాదివాస హవనాదులు చేసిన అనంతరం వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు హనుమద్వాహన సేవ చేశారు. రాత్రి 7 గంటలకు కేశవాపురం, నీరుకుళ్ల గ్రామాల్లోని పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులను ఎత్తుకుని ఆలయ వ్యవస్థాపకుడు కంది జితేందర్‌రెడి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ కంది పూలమ్మ, తిరుపతిరెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు కంది సరళ- జితేందర్‌రెడ్డి, కంది కృష్ణవేణి-మనోహర్‌రెడ్డి దంపతులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌లు వైనాల మురళి, రాజయ్య, గ్రామపెద్దలు కంది మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...