హేమాచలుని సన్నిధిలో భక్తుల పూజలు


Sat,May 25, 2019 03:01 AM

మంగపేట, మే 24 : మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 23న బ్రహ్మోత్సవాలు ముగిశాక కూడా పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ముందుగా భక్తులు చింతామణి సెలయేటి ధార వద్దకు వెళ్లి స్నానాలు ఆచరించారు. మరి కొందరు భక్తులు చింతామణి జలాన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు టిన్నుల్లో పట్టుకున్నారు. అనంతరం గర్భగుడి వ ద్దకు వెళ్లగా అర్చకులు భక్తుల పేర అర్చనలు నిర్వహించి, తీర్థాన్ని అందించి, ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల వద్ద పూజలు చేశారు. అనంతరం భక్తులు పంచముఖ ఆంజనేయస్వామి, వేణుగోపాల స్వామి, దైతమ్మ వార్ల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థాన ఈవో శ్రావణపు సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ సీతారాములు, ప్రధాన అర్చకులు కైంకర్య రాఘవాచార్యులు, రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ఆచార్యులు, ఈశ్వర్‌చందుశర్మ, వెంకటనారాయణశర్మ, సుధీర్, చక్రధర్, ఆలయ సిబ్బంది, ఆయా ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...