నేడే కౌంటింగ్..


Thu,May 23, 2019 02:18 AM

-పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
-ఏనుమాముల మార్కెట్‌లో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓట్లు..
-మహబూబాబాద్‌లో నర్సంపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
-కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ.. అడుగడుగునా నిఘా
-24 గంటల పాటు మద్యం దుకాణాల బంద్

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల మార్కెట్‌లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సం బంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. వాటిలో పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మహబూబాబాద్ లో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. ప్రతీ శాసన సభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. దీనికి మూడు కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చే శారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక ఏఆర్వో, మూడు టేబుళ్లకు ఒక ఆర్వో పర్యవేక్షణ ఉంటుంది. ఉదయం 8 గంటల కల్లా అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు హాల్‌కు చేరేలా చేశా రు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అనంతరం ఏజెంట్లు, పరిశీలకుల పర్యవేక్షణలో ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ సం దర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా బారికేడ్లతో ఇనుప జాలీలను అమర్చారు. ఏజెంట్లకు, లెక్కింపు అధికారులకు మధ్య వీటిని ఉండేలా చూశారు. దీని కోసం శాస్త్రీయంగా నిపుణుల సూచనలు కూడా తీసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 16,66,085 మంది ఓటర్లు ఉండగా.. 10,60,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 63.65 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ మొత్తం ఓట్లను లెక్కించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పరకాలలో 18 రౌండ్లు, వర్ధన్నపేటలో 20 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

అడుగడుగునా నిఘా..
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన ద్వారం గుండా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం నుంచి మొదలుకుని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు వ రకు గట్టి నిఘా ఉంచారు. ఈ మేరకు మూడంచెల రక్షణ వ్య వస్థ, సాయుధ పోలీసు బలగాల పహారా, గ్యాస్ టీంల ఏర్పా టు, సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణతో పాటు పోలీసులు తమ వేగులను కూడా రంగంలోకి దింపారు. దీంతో బుధవా రం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు పూర్తి నిఘా భద్రత ఏర్పాట్లను చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మూడంచెల భద్రతా వ్యవస్థ పకడ్బందీగా పనిచేసేలా అధికారులకు బాధ్యతలను అప్పగించారు.

పరిశీలకుల కనుసన్నల్లో ...
కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ ఉండే లా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ప్రతీ రౌండ్‌లో 14 టేబుళ్ల ద్వారా లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశారు. వీటికి ఈవీఎంల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ప్రతీ రౌండ్‌తోపాటు టేబుళ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులతో పాటుగా కౌంటింగ్ పరిశీలకులు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వీరి సూక్ష్మ పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ సం దర్భంగా ఎలాంటి లీక్‌లు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రౌండ్ల వారీగా ప్రత్యేకంగా ఆర్వో అనుమతితో పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా, మీడియా సెంటర్ ద్వారా ప్రజలు తెలుసుకునేలా కూడా ఏర్పాట్లు చేశారు. 14 టేబుళ్ల లెక్కింపు పూర్తయి.. ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి అనుమతి తర్వాతే ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికి బాధ్యతలు కూడా అప్పగించింది.

వెబ్‌సైట్‌లో ఫలితాలు ..
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చారు. వాటి ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్లు, ప్రజలకు ఎన్నికల ఫలితాలు అందించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘం రూపొందించిన సువిధ వెబ్‌సైట్ ద్వారా ఒక్కో రౌండ్ ఫలితాలను అప్‌లోడ్ చేస్తారు. నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పొందిన ఓట్లను లెక్కించి రౌండ్‌ల వారీగా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

మద్యం షాపులు బంద్..
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను బంద్ చేసేలా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు ఆదేశాలు ఇచ్చారు. 23వ తేదీ నుంచి 24 గంటల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయిస్తున్నట్లు చెప్పారు.ఈ డ్రై డే సందర్భంగా ఎక్కడ మందు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ మేరకు బెల్ట్‌షాపులతో సహా మూసి వేయించినట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌రావు వివరించారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles