ప్రశాంతంగా ఆన్‌లైన్ డైట్‌సెట్


Thu,May 23, 2019 02:16 AM

నర్సంపేట రూరల్, మే 22 : టీటీసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన డైట్‌సెట్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 805 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 579 మంది పరీక్షలు రాశారు. మరో 226 మంది గైర్హాజరయ్యారు. డైట్‌సెట్ ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.00గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.00గంటల నుంచి సాయంత్రం 4.00గంటల వరకు రెండో సెషన్ డైట్‌సెట్ ఆన్‌లైన్ పరీక్షలు జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం పరీక్షలకు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. తొలుత పరీక్షల నిర్వహకులు విద్యార్థుల వేలిముద్రలు తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆతర్వాత పరీక్ష హాల్‌లోకి విద్యార్థులను అనుమతించారు. జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లి బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డైట్‌సెట్ ఆన్‌లైన్ పరీక్షలకు ఉదయం 150 మందికిగాను 104మంది, మ ధ్యాహ్నం 150మందికి గాను 110మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు సెషన్లు కలుపుకొని 300 మంది విద్యార్థులకు గాను 214 మంది విద్యార్థులు హాజరై ఆన్‌లైన్ పరీక్షలు రాశారు. మరో 86 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ముగ్ధుంపురం జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 300 మందికిగాను 220 మంది, మధ్యాహ్నం 205మందికి గాను 145మంది విద్యార్థులు డైట్‌సెట్ పరీక్షలు రాశారు. రెండు సెషన్లు కలిపి 505 మంది విద్యార్థులకు గాను 365 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై ప్రతిభ చాటారు. మిగిలిన 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను అబ్జర్వర్లు పరిశీలించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...