వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి


Thu,May 23, 2019 02:16 AM

శాయంపేట, మే 22 : ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వర్షాల తో అప్రమంత్తంగా ఉండాలని జా యింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాయంపేట, ప్రగతిసింగారం, వసంతాపూర్, కొప్పులలోని రెండు సెంటర్లు, పెద్దకోడెపాకలో ధాన్యం కొనుగోలు కే ంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని ఆదేశించారు. నిర్వాహకులు ధాన్యాన్ని అసలైన రైతుల నుంచే కొనాలని సూచించారు. బయటి రైతులకు నేరుగా గన్నీ సంచులను అందించవద్దని స్పస్టంచేశారు. ధాన్యాన్ని పరీక్షించిన మీదటనే సంచులను అందించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన రైతులకు సంబంధించి వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేయడం లేదని స్పష్టం చేశారు. డబ్బులు వచ్చినా కొద్ది రైతుల ఖాతాల్లోకి పంపిస్తున్నామని అన్నారు. రైతులకు వారం లోనే డబ్బులు వారి ఖాతాలో పడాల్సి ఉన్నది అయితే డబ్బులు రావడంలో కొద్దిగా వెనుకాముందు అవుతున్నదన్నారు. మిల్లుల అలాట్‌మెంట్ కూడా హెడాఫీస్ నుంచే జరుగుతోంది. గతంలో మాదిరిగా మ్యాన్‌వల్‌గా లేదని ఓపీఎంఎస్ ద్వారా చేస్తున్నామని తెలిపారు.. మిల్లుల ట్యాగింగ్‌కు కెపాసిటి ఇచ్చారని ఆ కెపాసిటి పూర్తయ్యాక మరోసారి హైదరాబాద్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇది వరకు జేసీ, డీఎస్‌వో లెవల్‌లో అయిపోయినా కొద్ది మ్యాన్‌వల్‌గాచేశామన్నారు.కానీ నాలుగు రోజుల నుంచి నాలుగు మిల్లులకు నలభైవేల టన్నుల కెపాసిటీని ఇచ్చామన్నారు. ఈ కెపాసిటి పూర్తయిందని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే పర్మిషన్ వస్తుంది తెలిపారు. దాదాపు ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చాయన్నారు. డబ్బులు పడని రై తులకు ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...