ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలి


Thu,May 23, 2019 02:16 AM

చెన్నారావుపేట : ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని మండలంలోని ఎల్లాయగూడెం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు మాట్లాడారు. గ్రామానికి చెందిన కందకట్ల నర్సమ్మ, రామస్వామి, వడ్డేపల్లి భిక్షపతి, రాగి రామ్మూర్తి వద్ద (311, 327/2 సర్వేనంబర్లు) 4ఎకరాల స్థలాన్ని 2005 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఇళ్లులేని 63 మంది నిరుపేదలను గుర్తించి.. ఒక్కొక్కరికి 120 చదరపు గజాల చొప్పున పట్టాలను పంపిణీ చేసిందని చె ప్పారు. 14సంవత్సరాలు గడుస్తున్నా పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో హద్దులను ఏర్పాటు చేయలేదని, ఇళ్ల కోసం భూమిని పంపిణీ చేయడం మరిచి పోయారని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇందులో 20 గుంటల భూమిని ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారని, మరోవ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించాడని వివరించారు. ఇంకొకరు ఇంటి నిర్మాణం చేపట్టడానికి కొంత స్థలాన్ని ఆక్రమించుకుని ఇటీవల పిల్లర్ల కోసం రంధ్రాలు తీశాడని లబ్ధిదారులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హద్దులను ఏర్పాటు చేసి, భూమి పంపిణీ చేయాలని గ్రామస్తులు పరికిపండ్ల ఉమ, అబ్బనాపురం వినోద, ఎదురబోయిన నర్సింహాస్వామి, ఓరుగంటి భాగ్యమ్మ, బాషబోయిన కోమల, కవిత, రేణుక, కాగితోజు నాగమ్మ, జక్క రవి, వేముల ఉషారాణి, మల్లయ్య కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...