గుడుంబా తయారు చేస్తే పీడీయాక్టు నమోదు


Thu,May 23, 2019 02:16 AM

రాయపర్తి : గుడుంబా తయారు చే సినా, విక్రయించినా పీడీయాక్టు నమోదు చేస్తామని వర్ధన్నపేట ఎక్సైజ్ సీఐ కరుణశ్రీ హెచ్చరించారు. బుధవారం వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ సీఐ కరుణశ్రీ వరంగల్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో కలసి మండలంలోని బాలాజీ తండా, బాల్‌నాయక్‌త ండా, శివారంతండా, జయారంతండా, స న్నూరు, ఊకల్ గ్రామాల పరిధిలోని పలు గిరిజన తండాలు, దళిత వాడల్లో నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కరుణశ్రీ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు ముప్పు తలపెడుతున్న గుడుంబాను రాష్ట్రంలో ఉక్కుపాదంతో అణచి వేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో ఎవరైనా రహస్యంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడినట్లయితే తమకు సమాచారం అందించాల్సిందిగా ఆమె కోరారు. అనంతరం తండాలలో ఇంటింటికీ తిరుగుతూ ఆబ్కారీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 120 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. నిబంధలను ఉల్లంఘించి ఇంట్లో నిల్వ చేసుకున్న 10 కేజీల బెల్లం, పటికలను స్వాధీనం చేసుకుని నిల్వ చేసిన వారిపై పై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై కిశోర్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...