బీసీ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి


Thu,May 23, 2019 02:16 AM

గీసుగొండ,మే 22 : గీసుగొండ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సింహాస్వామి సూచించారు. బుధవారం ఆయన బీసీ హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ వసతిగృహానికి త్వరలోనే ప్రహరీ నిర్మాణానికి నిధులను మాంజూరు చేస్తామని ఆయన తెలిపారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్లను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి, వార్డెన్ నరేందర్, టీజేఎస్ కన్వీనర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...