క్విజ్ పోటీల్లో సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ


Thu,May 23, 2019 02:16 AM

చెన్నారావుపేట,మే 22 : క్విజ్ పోటీల్లో సిద్ధార్థ విద్యార్థులు అత్యుత్తమైన ప్రతిభను కనబర్చి బహుమతులు సాధించినట్లు సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు. అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని పు రస్కరించుకొని నర్సంపేట ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో జీవ వైవిద్యం-ఆహారం ఆరోగ్యం అనే అంశంపై ఇటీవల క్విజ్, వ్యాసరచన, వకృత్వం, చిత్ర లేఖనం పోటీలను ని ర్వహించారు. ఆ పోటీల్లో విద్యార్థులు పాల్గొని క్విజ్‌లో పూదోట పవన్ ఆంటోనిరాజ్, ముదురుకోల సాయివెంకట్, యార గణేశ్, కొరుకొండ ప్రవీణ్, హన్మకొండ అర్జున్‌లు ప్రథమ బహుమతి సాధించారు. తృతీయ బహుమతిని చెంచు రుద్రేశ్, మనోజ్, శ్రీకాంత్, తారకరామ్ చిత్ర లేఖనంలో బెజ్జంకి నాగవర్థన్ బహుమతులు సాధించినట్లు తెలిపారు. వీరు బుధవారం అటవీశాఖ సీసీఎఫ్‌వో అక్బర్, డీఎఫ్‌వో పురషోత్తం, ఐఎఫ్‌వో లావణ్యల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అండెం కర్ణాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ నరిగె శివరాజు, వేమునూరి గణేశ్, మెట్ట రమేశ్, సాంబయ్య, పవన్, కృష్ణమోహన్, పడిదం అనిల్, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...