నాణ్యతగల విత్తనాలనే అందించాలి


Tue,May 21, 2019 01:25 AM

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు నాణ్యమైన వాటినే రైతులకు అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లకు అవగాహన కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి పారుదల పెరగడంతో వ్యవసాయ సాగు గణనీయంగా పెరిగిందన్నారు. రైతులకు వెన్నెముకగా ఉంటూ మంచి దిగుబడులు సాధించే విత్తనాలను, ఎరువులు, పురుగుమందులను అందించాలన్నారు.

డీలర్లు ప్రతీ స్టాక్‌కు సంబంధించిన ఇన్‌వాయిస్‌, స్టాక్‌ రిజిష్టర్‌, స్టాక్‌బోర్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ముందస్తుగా షాపులకు సంబంధించిన రిజిష్టర్లను సంబంధిత వ్యవసాయ అధికారులతో ధ్రువీకరించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ స్కాడ్స్‌ని నియమించినట్లు చెప్పారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తనిఖీలు చేసే అవకాశం ఉందన్నారు. రైతులకు గ్లిఫోసేట్‌ అమ్మొద్దని, దాని వలన వచ్చే అనర్థాలను రైతులకు వివరించాలని జేడీఏ ఉషాదయాళ్‌ అన్నారు. బీజీ3 పత్తి విత్తనాలు అమ్మడం, పంట వేయడం చేయకూడదన్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీడ్‌ సర్టిఫికేషన్‌ శాఖ, పోలీసు శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తారని నర్సంపేట సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.

డీలర్లు లేబలింగ్‌ సరిగ్గాలేని స్టాకును ఎట్టిపరిస్థితుల్లో అమ్మకూడదన్నారు. బీజీ3 పత్తి/జీఈఏసీ అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మినా పీడీ యాక్టు నమోదవుతుందని హెచ్చరించారు. వరంగల్‌ ఏడీఏ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు తనిఖీ చేసే సమయంలో తాళాలు వేసుకుని వెళ్లడం, స్పందించకుండా ఉండడం సరికాదన్నా రు.

అడిగిన అన్ని రికార్డులను చూపించాలన్నారు. గోడౌన్‌ పాయింట్స్‌ లైసెన్స్‌లో రికార్డు చేయించాలన్నా రు. జిల్లా డాక్ట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు విత్తనశుద్ధి, సమగ్ర సస్యరక్షణ, కలుపు నివారణతోపాటు ఏ పంటలో ఎలాంటి చర్యలు చేపట్టాల్లో డీలర్లు సమగ్రంగా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో హరిసింగ్‌, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్‌ అర్బన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు విద్యాసాగర్‌, సురేశ్‌కుమార్‌, శ్రీనివాసరావు, దామోదర్‌రెడ్డి, తెలంగాణ సీడ్స్‌ రీజినల్‌ మేనేజర్‌ రఘు, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కన్సల్టెంట్‌ సారంగం పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...