ఆరోగ్యశ్రీలో సెరిబ్రల్‌ పాలసీ రోగులకు చికిత్స


Tue,May 21, 2019 01:24 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: ఆరోగ్యశ్రీ పథకంలో సెరిబ్రల్‌ పాలసీ రోగులకు చికిత్స అందిస్తున్నామని హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి చెందిన ప్రము ఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రోషన్‌ తెలిపారు. సోమవారం నర్సంపేటలోని ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు సెరిబ్రల్‌ పాలసీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సెరిబ్రల్‌ పాలసీ అనే వ్యాధి చిన్న పిల్లల్లో వస్తుందన్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు కాళ్లు, చేతులు పనిచేయవన్నారు. కోతి లాగ నడుస్తారని తెలిపారు. ఇలాంటి రోగులకు శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చన్నారు. జాయింట్స్‌ రిపేర్లు చేయడం ద్వారా చిన్నపిల్లలను మామూలు స్థితికి తీసుకురావచ్చన్నారు. ఇలాంటి పిల్లలకు కామినేని ఆస్పత్రిలో వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో నిధులను అందిస్తున్నదన్నారు. దేశంలో ఇలాంటి రోగులు 2.50 లక్షల మంది ఉన్నారని తెలిపారు. తాను ఏడు సంవత్సరాలలో ఇలాంటి రోగులు 38 మందికి ఆపరేషన్లు చేశానని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...