టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ కౌన్సిలర్‌..


Tue,May 21, 2019 01:24 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ పుల్లూరి సంధ్యస్వామి గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ కౌన్సిలర్‌ టీఆర్‌ఎస్‌ తరుఫున శిబిరంలోకి చేరిపోయారు. సోమవారం టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఢిల్లీ టూర్‌కు పయనమయ్యారు. దీనిలో భాగంగా పుల్లూరి సంధ్యస్వామి గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆమెకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అక్కడ నుంచి ఆయన టీఆర్‌ఎస్‌ శిబిరంలోకి వెళ్లారు. ఐదేళ్ల కిందట నర్సంపేట మున్సిపాలిటీలో పుల్లూరి సంధ్య స్వామి గౌడ్‌ టీడీపీ నుంచి గెలిశారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎకైక కౌన్సిలర్‌ కూడా ఆమె. తర్వాత చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఐదేళ్ల పాటు ఆమె కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి నలుగురు కౌన్సిలర్లే మిగిలారు. టీఆర్‌ఎస్‌కు 16 మంది కౌన్సిలర్ల బలం ఉంది. వీరంతా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి ఓటు వేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌కు ఎదురులేదన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ప్రజలు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజాఆశీర్వాదంతో సీఎం కేసీఆర్‌ పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నర్సంపేట మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. కౌన్సిలర్ల పూర్తి మద్దతు తమకే ఉందన్నారు. ఈ కౌన్సిలర్లు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థికి పలువురు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నట్లు తెలిపారు. చేరికలతో టీఆర్‌ఎస్‌ బలం పుంజుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్‌ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, మునిగాల వెంకట్‌రెడ్డి, నాయిని నర్సయ్య, శివరాత్రి స్వామి, పెండెం వెంకటేశ్వర్లు, బండిప్రవీణ్‌, మండల శ్రీనివాస్‌, వాసం సాంబయ్య, సవర్ణపాక సందీప్‌, కొంకీస జ్ఞాన్‌సాగర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...