ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు


Sun,May 19, 2019 02:28 AM

పాలకుర్తి రూరల్, మే 18 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం ఖాయమైందని, కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్‌కు చెందిన గూడూరు ఎంపీటీసీ బెల్లి దేవేందర్ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా దేవేందర్‌కు మంత్రి ఎర్రబెల్లి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వ్వానించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే హావా కొనసాగుతోందని అన్నారు. వరంగల్ స్థానిక సంస్థల టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉనికి కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు. గెలవమనే విషయం కాంగ్రెస్ నాయకులకు తెలుసని అన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ కథ ముగిసిందని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జన్ను జకార్య, మండల ఇన్‌చార్జి, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, గుడిపుడి గోపాల్‌రావు, సీనియర్ నాయకులు బొబ్బల అశోక్‌రెడ్డి, విజయ్‌కుమార్, నక్క నాగయ్య, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, గుగులోత్ పార్వతి, జర్పుల బాలునాయక్, జర్పుల గీత పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...