అన్నదాతలూ..ఆగమాగం కావొద్దు


Sun,May 19, 2019 02:27 AM

రాయపర్తి, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు, పల్లెల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని, అక్కడక్కడా తలెత్తున్న సమస్యలతో అన్నదాతలు ఆగంకావొద్దని జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎల్‌ఆర్‌యూపీ(ల్యాండ్ రికార్డు అప్‌గ్రేడేషన్) రెండో విడతలో భాగంగా శనివారం మండలంలోని మైలారం గ్రామంలో తహసీల్దార్ రవిచంద్రారెడ్డి నేతృత్వంలో రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. సభకు ఆకస్మికంగా విచ్చేసిన ఆయన రెవెన్యూ సభ నిర్వహిస్తున్న తీరు తెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సుమారు 90 శాతం భూ రికార్డులను రెవెన్యూ యంత్రాంగం ఇప్పటి వరకు శుద్ధీకరణ చేసినట్లు చెప్పారు. గతేడాది నుంచి ప్రభుత్వం నిర్వహించిన పహాణీల ప్రక్షాళన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న క్లియరెన్స్ భూములను రైతులు కోరిన విధంగా సమగ్ర విచారణ జరిపి, పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేసినట్లు చెప్పారు. కోర్టు తగాదాలు, ప్రభు త్వం పంపిణీ చేసిన భూములు, ప్రభు త్వ బంచరాయి, అసైన్డ్, లావాణీ పట్టా, దేవాదాయ భూములు, డిస్ప్యూట్‌లో ఉన్న భూములను రికార్డు చేయలేదన్నా రు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని అన్ని రకాల భూములను రికార్డుల్లో నమోదు చేసి భూ రికార్డుల శుద్ధీకరణను 100 శాతం సాధించేందు కు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక ధరణి వెబ్‌సైట్‌లో తలెత్తుతున్న సాంకేతికపరమైన సమస్యల కారణంగా రైతాంగానికి సత్వరం సేవలందించలేకపోతున్నామన్నారు. విషయాన్ని రైతు లు, ప్రజాప్రతినిధులు,బాధితులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రతీ గుంట భూమిని రికార్డుల్లో నమోదు చేసేంత వరకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ గ్రామ సభలకు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా సహకరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, రైతులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో గిర్ధావర్ మల్ల య్య, సర్పంచ్ లేతాకుల సుమతి యాదవరెడ్డి, వీఆర్‌వోలు యాకయ్య, రజిత, చందర్, యాకాంబ్రం, వాసు, ఎల్ల య్య, గోపీసింగ్, వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్, రజిత, అరుణ్‌కుమార్, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...