ప్రతీ రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం


Sun,May 19, 2019 02:27 AM

దామెర, మే 18 : చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం భూ రికార్డుల శుద్ధీకరణ చేపట్టిందని పరకాల ఆర్డీవో కిషన్ అన్నారు. శనివారం దామెర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దామెర, ముస్త్యాలపల్లి గ్రామలకు చెందిన భూ రికార్డుల శుద్ధీకరణ సభ జరిగింది. తహసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆర్డీవో కిషన్ మాట్లాడుతూ పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో ఎక్కువ, తక్కువ విస్తీర్ణంతో వచ్చిన రైతులు తమ దృష్టికి సమస్యను తీసుకొస్తే అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారసత్వం నుంచి వచ్చే భూములకు సంబంధించిన వారు నేరుగా దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరించి, పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేస్తామన్నారు. సాదాబైనామా కోసం వచ్చే రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించమన్నారు. ఇప్పటి వరకు 52 సమస్యలు రైతులు తమ దృష్టికి తీసుకురాగా, 12 సమస్యలు పరిష్కరించినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రతీ రైతుకు న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకోసమే రైతుల భూములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా భూ రికార్డుల శుద్ధీకరణ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ హేమ, ఆర్‌ఐ రాంబాబు, వీఆర్వోలు నర్సింహులు, శైలజ, సతీశ్, బాబు, అయిలయ్య, శ్రీనివాస్, కృష్ణమూర్తి, సర్వేయర్ కవితారాణి, ఎఎస్‌ఓ హైమావతి, సర్పంచ్‌లు, శ్రీనివాస్, శ్రీరాంరెడ్డి, కల్పనకృష్ణమూర్తి, పోలం కృపాకర్‌రెడ్డి, దామెరుప్పుల శంకర్, చారీ పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...