కల్యాణం.. కమనీయం


Sat,May 18, 2019 01:55 AM

-వైభవంగా మత్స్యగిరీశుడి పెండ్లి
శాయంపేట, మే 17 : కొలిచిన వారికి నేనున్నానంటూ కొండంత అండగా నిలిచే శ్రీ మత్స్యగిరీశుడి పెండ్లి వేడుకలు శుక్రవారం కనుల పండువగా జరిగాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య మత్స్యగిరిస్వామి, శ్రీదేవిభూదేవీల కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాయంపేట మండల కేంద్రంలోని కాకతీయుల ఇలవేల్పు శ్రీమత్స్యగిరిస్వామి అధ్యయన తిరుకల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం మత్స్యగిరీశుడి కల్యాణోత్సవాన్ని యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాలచార్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ వేడుకలను పెద్ద ఎత్తున ప్రజలు తిలకించారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ సామల భిక్షపతి దంపతులు తమ నివాసం నుంచి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు, మట్టెలను మేళతాళాల మధ్య తీసుకెళ్లి కల్యాణోత్సవ వేడుకల్లో స్వామికి అందజేశారు. శ్రీమత్స్యగిరీశుడు, శ్రీదేవిభూదేవిల వివాహాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. జిలుకరబెల్లం పెట్టించి అర్చకులు మాంగళ్యధారణ చేశారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు మంగళసూత్రాన్ని భక్తజనులకు చూపించి అమ్మవారి మెడలో అలంకరించారు. అనంతరం చైర్మన్ సామల భిక్షపతి దంపతులతో పాటు భక్తులు స్వామివారికి తలంబ్రాలను పోశారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కల్యాణాన్ని కనులారా వీక్షించి త మకు మంచి జరగాలని వేడు కున్నారు. కల్యాణోత్సవం అనంతరం ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో హోమం, సదస్యం జరిపించారు. వేడుకల్లో జిన్నా ప్రతాప్‌రెడ్డి, కుసుమ వెంకన్న, జిన్నా కృపాకర్‌రెడ్డి, వార్డు సభ్యుడు బేరుగు సాగర్, అరవింద్, హనుమాన్ భక్తులు ఏనుగుల శ్రావన్, బాలకృష్ణ, భక్తులు పాల్గొన్నారు. కాగా, శనివారం రాత్రి గజవాహనంపై స్వామిని మచ్చర్లయ్య గుట్టకు తీసుకెళ్లిపూజలు చేస్తామని అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలిని చైర్మన్ తెలిపారు.

కనుల పండువగా శ్రీలక్ష్మీనర్సింహుడి కల్యాణం
దామెర, మే 17 : మండలంలోని ఊరుగొండలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తూపురాణి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో వేదపండిలై బాలకృష్ణమాచార్యులు, అఖిలకుమారాచార్యులు, శేషాచార్యులు, వినయకుమారాచార్యులు వేదమంత్రోత్సహరణల మధ్య స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆదిలక్ష్మీ, చెంచుకలక్ష్మీ సహితంగా ఆలయంలో కొలువై ఉన్న స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ బద్దం గా సర్పంచ్ గోగుల సత్యనారాయణరెడ్డి దంపతులు భాజాభజంత్రీల మధ్య పుస్తె, మట్టెలు తీసుకువచ్చారు. లక్కిడి శ్రీనివాస్‌రెడ్డి పూజా సమాను బహుకరించారు. ఈ సందర్భంగా అశేశభక్త జనసందోహం మధ్య కల్యాణ కత్రువును అర్చకులు నిర్వహించారు. స్వామివారు ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సహితంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆదిదేవునికి కొబ్బరి, పసుపు, కుంకుమ, నూతన వస్ర్తాలు సమర్పించి కుటుంబాలు సల్లంగా ఉండేలా దీవించాలని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ భజనమండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలపాలను నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు ఊరుగొండతోపాటు దుర్గంపేట, దమ్మన్నపేట, పసరగొండ తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆ లయ సమీపంలో బొల్లు శ్రీనివాస్‌రెడ్డి జ్ఞాపకార్థం మహాన్నదానం జరిగింది. కార్యక్రమంలో సర్పం చ్ గోగుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్‌గౌడ్, ఉపసర్పంచ్ విద్యాసాగర్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు బొల్లు రాజు(రాజిరెడ్డి), మండల అధ్యక్షుడు జకీర్ అలీ, ఎస్సీసెల్ మండల అధ్యక్షు డు సిలివేరు నర్సయ్య, పెండ్యాల ప్రసన్నారెడ్డి, ఆరె వెంకట్‌రెడ్డి, ముప్పు రామస్వామి, లక్ష్మీనారాయణ, మల్లాడి రాజిరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, మల్లాడి మల్లారెడ్డి, జ క్కుల రవీందర్, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...