కొనసాగుతున్న కల్యాణోత్సవాలు


Fri,May 17, 2019 03:15 AM

-మత్స్యగిరీశుడి ఆలయంలో వైభవంగా గరుడముద్ద ఎగరవేత, గణపతి హోమం!
-అధిక సంఖ్యలో హాజరై తిలకించిన భక్తులు
శాయంపేట, మే 16 : మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీమత్స్యగిరిస్వామి అధ్యయన తిరుకల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు గురువారం గరుడముద్ద, గరుడపటం ఎగరవేత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, గణపతి హోమాన్ని జరిపించారు. యాగ్నికులు వీరవెల్లి వేణుగోపాలచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గణపతి హోమాన్ని చేపట్టారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధన్‌ పూజలు చేశారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరిపించి, గరుడ పటాన్ని ఎగరవేశారు. అనంతరం అత్యంత ప్రీతిపాత్రమైన గరుడముద్దను ఆలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు ఎగరవేసి తీర్థ ప్రసాదాలను భక్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గరుడముద్దను భక్తులు ఆనందంతో అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. అర్చకులు, యాగ్నీకులు ధ్వజారోహణం విశిష్టతను వివరించారు. శ్రీమత్స్యగిరిస్వామి గుడి లో ధ్వజారోహణం చేసి గరుడ పటాన్ని ఎగరవేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నారు. అత్యంత విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల భక్తుల కష్టా లు తొలగిపోతాయని చెప్పారు. కాగా, కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తిలకించా రు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ సామల భిక్షపతి, జిన్నా ప్రతాప్‌సేనారెడ్డి, అనుకారి అశోక్‌, బాసాని విద్యాసాగర్‌, కోమటి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...