స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు


Fri,May 17, 2019 03:14 AM

-పది పోలింగ్‌ కేంద్రాలు 902 మంది ఓటర్లు
(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల 31న జరిగే ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలు, ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండే ఓటర్లు ఎంతమంది? వంటి అంశాలపై ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నివేదించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్‌ కేంద్రాలకు ప్రతిపాదనలు చేసి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సహా ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓటర్లు, వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం, ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉండే పరిధి మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 902 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలు, ఆయా పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...