38 మందిపై సస్పెన్షన్‌ ఎత్తివేత


Fri,May 17, 2019 03:14 AM

-వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారు
-అధిష్టానం ఆమోదం లేకుండా ఎవరినీ సస్పెండ్‌ చేయొద్దు
-సమన్వయంతో పనిచేయాలి
-ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
-టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి మండలాల్లో 38 మంది టీఆర్‌ఎస్‌ నాయకులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం వారంతా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆమోదం లేకుండా ఏ స్థాయి నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయొద్దని, చేసినా అవి చెల్లుబాటు కావని బాలమల్లు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 38 మంది టీఆర్‌ఎస్‌ నాయకులను స్థానిక నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిందని తెలిపారు. ఈ జాబితాలో ఘన్‌పూర్‌ జెడ్పీటీసీ బుక్లా స్వామి నాయక్‌, ఘన్‌పూర్‌ వైస్‌ ఎంపీపీ బూర్ల లతా శంకర్‌, జనగామ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సింగపురం జగన్‌, ధర్మసాగర్‌ మాజీ ఎంపీపీ రాజారపు యాదగిరి, శివునిపల్లి ఎంపీటీసీ బూర్ల శంకర్‌, ఘన్‌పూర్‌ ఎంపీటీసీ సింగపురం దయాకర్‌, క్యాతంపల్లి ఎంపీటీసీ పెరుమల్ల మహేందర్‌, ధర్మపురం సర్పంచ్‌ మునిగాల యాకూబ్‌, ధర్మసాగర్‌ మండలం మాజీ సర్పంచ్‌ల ఫోరం దార నర్సింహారెడ్డి, ఘన్‌పూర్‌ మండలానికి చెందిన పల్లె రవీందర్‌, చట్ల రాములు, వట్టి రత్నాకర్‌రెడ్డి, గొడిశాల విజేందర్‌, గంగారపు సత్యనారాయణ, గొడిశాల యాదగిరి, చట్ల శ్రీనివాస్‌, మంద రాజు, లింగన వేణు శ్రీనివాస్‌, ఆకుల నర్సింహారావు, గుర్రం శ్రీనివాస్‌, కోల సమ్మయ్య, తోట నాగరాజు స్రవంతి, కత్తురాల యాదయ్య ఉన్నారని తెలిపారు.

అలాగే రఘునాథపల్లి నాయకులు గుగులోత్‌ బిక్కు (మండల గూడెం), బాలనే శ్రీనివాస్‌ (మాదారం), తూడి సంజీవ, తూడి ఖాజాబాబు, తిప్పారపు రవీందర్‌ (నారాయణపురం), బండ కుమారస్వామి (శ్రీమన్నారాయణపురం), తాటికొండ వెంకటేశ్‌, మేకల వరలక్ష్మీ (కోమల్ల), గైని శ్రీనివాస్‌ (బాణాజీపేట), దుంబాల భాస్కర్‌రెడ్డి (నాగారం), వంగ నాగరాజు (కుందారం), కారంపుడి చంద్రయ్య (లింగాల ఘనపురం), పోకల శంకరయ్య (లింగాల ఘనపురం), వంచ నర్సిరెడ్డి (వనపర్తి) ఉన్నారని బాలమల్లు వివరించారు. ఘన్‌పూర్‌, రఘునాథపల్లి మండలాల టీఆర్‌ఎస్‌ నాయకుల సస్సెన్షన్‌ వ్యవహారం పార్టీ అధిష్ఠానం దృష్టికి రాగానే సంబంధిత పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అక్కడి పార్టీ నాయకుల మధ్య విబేధాలను పరిష్కరించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పార్టీ నుంచి ఏ స్థాయి నాయకునైనా సస్పెండ్‌ చేసే అధికారం కేవలం అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నిబంధనలు అతిక్రమించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే తగు విచారణ జరిపి అధిష్టానం క్రమశిక్షణ చర్య లు తీసుకుంటుందని హెచ్చరించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అన్ని స్థాయిల నాయకులు విబేధాలు లేకుండా సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే, ఈ నెల 31న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తా చాటాలని బాలమల్లు పిలుపునిచ్చారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...