గాలివానతో అతలాకుతలం


Thu,May 16, 2019 03:10 AM

-గూడెప్పాడ్‌లో జాతీయ రహదారిపై విరిగి పడిన చెట్టు
-ఆత్మకూరుమండలంలోదెబ్బతిన్న కూరగాయల పంటలు
-శాయంపేటలో తడిసి ముద్దయిన ధాన్యం
శాయంపేట, మే 15 : మండలంలో బుధవారం ఈదురు గాలులతో జోరు వాన పడటంతో జనజీవన అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో గంట పాటు జోరు వర్షం పడింది. దీంతో వరద లోతట్టు ప్రాంతాలకు చేరింది. గాలులకు ఇంటి పై రేకులు పలు చోట్ల ఎగిరిపడినట్లు స్థానికులు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో ధాన్యం కొద్దిగా తడిసిపోయింది. శాయంపేట గోదాముల వద్ద బయట ఆరబోసిన ధాన్యం వర్షం నీటికి తడిసింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తమై కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలపై టార్ఫాలిన్‌ షీట్లు కప్పి ధాన్యాన్ని కా పాడుకున్నారు.

ఆత్మకూరు : మండలంలోని కా మారం, ఆత్మకూరు గ్రామాల్లో ఇంటిపై కప్పు రేకులు నెలమట్టమయ్యాయి. కామారం గ్రామానికి చెందిన దుగ్యాల పైడి,రమేశ్‌లకు చెందిన ఇంటి పై కప్పులు ఎగిరిపోయాయి. కురిసిన వర్షానికి ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు తడిసి పోయాయి. అకాల వర్షం వల్ల రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులు, మెరుపులు వల్ల అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. కామారం,అగ్రపంహాడ్‌, చౌళ్లపల్లి, పెద్దాపురం, అక్కంపేట ,ఆత్మకూరు గ్రామాల్లో కూరగాయాల పంటలు దెబ్బతిన్నాయి. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు సంబంధిత అధికారులను కోరారు.
నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేటలో బుధవారం సాయంత్రం గాలి దుమారం వీచింది. సా యంత్రం మూడు గంటల నుంచి వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులు వచ్చాయి గాలి దుమారంతో మామిడి చెట్లకు ఉన్న కాయలు రాలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...