విత్తనాల విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి


Thu,May 16, 2019 03:07 AM

-ఏడీఏ సురేశ్‌ కుమార్‌
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మే 15 : త్వ రలో ప్రారంభంకానున్న వానకాలం పంటల సా గుకోసం రైతులకు మేలైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని వ్యవసాయశాఖ ఏడీఏ సురేశ్‌కుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో బుధవారం ఎ రువులు, విత్తనాల డీలర్లతో సమావేశం ఏర్పా టు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలే తప్ప గు ర్తింపులేని కంపెనీలకు సంబంధించిన విత్తనాల ను ఏమాత్రం విక్రయించొద్దని ఆయన హెచ్చ రించారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి నాణ్యమైన గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలతో పాటుగా ప్రైవేట్‌ కంపెనీలకు సంబంధించిన నాసిరకం విత్తనాలు కూడా వస్తున్నాయని అన్నారు. లాభాల కోసం అమాయకులైన రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయించినట్లయితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రోజూ వారీగా విత్తనాలు, ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను విధిగా నిర్వహించాలని అన్నారు. ధరల పట్టికలను కూడా ఎప్పటికప్పుడూ దుకాణంలో రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పలువురు డీలర్లు వారి సమస్యలను కూడా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రాంనర్సయ్య, ఇతర అధికారులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...