వాతావరణ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి


Thu,May 16, 2019 03:06 AM

-టీఎస్‌డీపీఎస్‌ రాష్ట్ర అధికారి ప్రసాదరావు
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మే 15 : వర్షపాతం, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనాన్ని, గాలితేమ శాతాన్ని తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాతావరణ సూచిక కేంద్రాలను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంస్థ కార్యనిర్వహణ అధికారి ప్రసాదరావు సూచించారు. బుధవారం వర్ధన్నపేట 132/33కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వాతావరణ సూచీ కేంద్రంతో పాటుగా పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని పలు సబ్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాతావరణ సూచీ కేంద్రాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేసి వాతావరణ సమతుల్యతలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని క లెక్టర్‌ కార్యాలయాలలో కూడా ప్రత్యేకంగా వాతావర ణ పరిస్థితులను సబ్‌సెంటర్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునేందుకు ఎల్‌ఈడీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో 924 కేంద్రాలను ఏ ర్పాటు చేయగా వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. వాతావరణం లో ఆకస్మికంగా వస్తున్న మార్పులతో పాటుగా ఉష్ణోగ్రత, చలి, తేమ, వర్షపాతం తెలుసుకునేందుకు ఈ కేం ద్రాలను ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలిపే విధంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రణాళిక అధికారులు సుభాష్‌, మహిపాల్‌, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...