ఆర్థిక అక్షరాస్యతపై పెంచుకోవాలి


Thu,May 16, 2019 03:05 AM

-డీఆర్‌డీఏ బ్యాంకు లింకేజీ డైరెక్టర్‌ వైఎన్‌ రెడ్డి
వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని డీఆర్‌డీఏ బ్యాంకు లింకేజీ డైరెక్టర్‌(హైదరాబాద్‌) వైఎన్‌ రెడ్డి సూచించారు. బుధవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయంలో సెర్ఫ్‌ సిబ్బందికి ఏపీఎంలు, సీసీలు, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ హెచ్‌ఎల్‌పీ, ఎంసీపీ, ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకుల నుంచి ఇస్తున్న వివిధ రకాల రుణాలపై అవగాహన కల్పించారు. వాటితో కుటుంబ జీవనోపాధులు, సూక్ష్మరుణ ప్రణాళికల తయారీ, ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ, ఆస్తులు ఏర్పాటు చేసుకుని ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎలా ఉపాధి పొందాలనే వాటిపై డీఆర్‌డీవో సంపత్‌తో కలిసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీ సభ్యులు క్రమం తప్పకుండా పొదుపులు, అప్పులు సకాలంలో చెల్లించడంతోపాటు పుస్తక నిర్వహణ ఉండేలా చూసుకోవాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతతో బ్యాంకులు ఇస్తున్న రుణాలపై అవగాహన పెరగడంతోపాటు జీవనోపాధి, సూక్ష్మరుణ ప్రణాళికలు తెలుస్తాయన్నారు. రుణాలను ఉత్పాదకాలపై నే పెట్టుబడి పెట్టేలా సిబ్బంది చూసుకోవాలన్నారు. ప్రతీ సభ్యురాలు అవసరానికి అనుగుణంగా రుణాలు తీసుకోవాలని, సమాన పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు. దీనిపై ప్రతీ కుటుంబానికి అవగాహన కల్పిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలన్నారు. ఎన్‌పీఏ సంఘాలు లేకుండా చూసుకోవాలని, క్రమం తప్పకుండా జేఎంఎల్‌బీసీ, సీబీఆర్‌ఎం సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో బ్యాంకు లింకేజీ సమస్యలు పరిష్కరించుకోవాలని, ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసుకుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ పరమేశ్వర్‌, డీపీ ఎం వీరమల్లు, అనిత, బ్యాంకుల లింకేజీ డీపీఎం, జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...