పాముకాటుతో బాలుడి మృతి


Thu,May 16, 2019 03:05 AM

ఖానాపురం, మే15 : మండలంలోని ధర్మరావుపేట పంచాయతీ పరిధిలోని బాలుతండాకు చెందిన హనుమాన్‌ మాలధారణ ధరించిన బాలుడు బా నోత్‌ చరణ్‌(10) ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌లో పాముకాటుతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇదే తండాకు చెందిన బానోత్‌ దస్రు, జ్యోతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం కొద్ది కాలంగా కటాక్షపూర్‌లో నివసిస్తున్నారు. బానోత్‌ దస్రు జెసీబీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా కొద్ది రోజుల క్రితం కుమారుడు చరణ్‌తో కలిసి దస్రు హనుమాన్‌ మాల ధరించారు. బుధవారం రాత్రి తండ్రీ కొడుకు మరికొంతమంది హనుమాన్‌ భక్తులతో కలిసి కటాక్షపురంలోని హనుమాన్‌ దేవాలయంలో నిద్రకు వెళ్లారు. చరణ్‌ నిద్రలో ఉండగా పాము కాటు వేసింది. గమనించిన హనుమాన్‌ భక్తులు దవాఖానకు తీసుకెళ్లే క్రమంలో చరణ్‌ మృతిచెందాడు. బాలుడి మృతదేహాన్ని స్వగ్రామం బాలుతండాకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మృతుడి కుటుంబాన్ని నర్సంపేట మార్కెట్‌ ఛైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు పరామర్శించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...