నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


Thu,May 16, 2019 03:05 AM

రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌, అబ్కారీ శాఖల నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని వర్ధన్నపేట అబ్కారీ శాఖ సీఐ కరుణశ్రీహెచ్చరించారు. బుధవారం మండలంలోని జయరాంతండా, శివారంతండా, బాల్‌నాయక్‌తండా, సన్నూరు గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కరుణశ్రీ మాట్లాడుతూ.. గుడుంబా తయారీ, బెల్లం క్రయ విక్రయాలకు పాల్పడినట్లయితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సోదాల్లో లభ్యమైన 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. బాల్‌నాయక్‌తండాకు చె ందిన భూక్య మంగమ్మ ఇంట్లో 5 లీటర్ల గుడుంబాను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆమెపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సోదాలలో 10 కేజీల నల్లబెల్లం లభ్యమైనట్లు ఆమె వివరించారు. ఈ దాడులలో సిబ్బంది వెంకటేశ్‌, రవి, ఇలియాస్‌ పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...