బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు


Thu,May 16, 2019 03:05 AM

-జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజు
పరకాల, నమస్తే తెలంగాణ : బాల్యవివాహాలు చేస్తే బాలల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజు అన్నారు. బుధవారం నడికూడ మండలంలోని సర్వాపూర్‌ గ్రామానికి ఐసీడీఎస్‌, ఐపీడీఎస్‌ అధికారులతోపాటు బాలల సంరక్షణ అధికారులు చేరుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ పదవ తరగతి పరీక్షలు రాసిన అమ్మాయిని అదే గ్రామానికి చెందిన అబ్బాయికిచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించిన విషయం చైల్డ్‌లైన్‌ 1098కు సమాచారం అందింది. దీంతోఅధికారులు గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడమంటే బాలల హక్కులు హరించడమేనని అన్నారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తరువాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తరువాతనే వివాహం చేయాలన్నారు. బాల్యవివాహాలతో బాలికలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ టీ పద్మావతి మాట్లాడుతూ బాలికలకు ఏదైనా సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలన్నారు. బాలల హక్కుల రక్షణలో తమవంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బోగి శ్రీలత, ఉప సర్పంచ్‌ మీనుగు రాజు, సోషల్‌ వర్కర్‌ రాజ్‌కుమార్‌, చైల్డ్‌లైన్‌ సిబ్బంది సునీత, అంగన్‌వాడీ టీచర్‌ కల్పన పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...