ప్రాదేశికం ప్రశాంతం


Wed,May 15, 2019 03:16 AM

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు పరిసమాప్తమయ్యాయి. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకుగానూ మంగళవారంతో ఎన్నికలు ముగిశా యి. జిల్లాలోని మొత్తం ప్రా దేశిక ఎన్నికను అధికార యంత్రాంగం మూడు విడతల్లో పూ ర్తిచేసింది. మొదటి విడతలో 62 ఎంపీటీసీ స్థానాలతోపాటు ఐదు జె డ్పీటీసీ స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరుగగా రెండో విడతో 63 ఎంపీటీసీ స్థానాలకు ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మంగళవారం జిల్లాలోని చెన్నారావుపే ట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ ఐదు మండలాల్లో ఎన్నికలు జరుగగా అత్యధికంగా ఆత్మకూరు మండలంలో 85.55 శాతం పోలింగ్‌ జరుగ గా అత్యల్పంగా నెక్కొండ మండలంలో 77.21 శాతం పోలింగ్‌ నమోదైంది.

చెన్నారావుపేటలో 80.51శాతం, దామెరలో 84.19 శాతం, గీసుకొండలో 84.90 మొత్తం పోలింగ్‌ న మోదైంది. కాగా, ఐదు మండలాల్లో 81.73 శాతం పోలింగ్‌ నమోదైంది. 1,47,518 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేయగా 1,20,566 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 59,285 మంది పురుషులు ఉండగా 61,281మంది మహిళలు ఉ న్నారు. మొత్తంగా జిల్లాలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు పరిసమాప్తమయ్యాయి. ఉద యం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు సాఫీ గా సాగాయి. ఉదయం 9 గంటల వరకు 18.16 శాతం నమోదైన ఓటింగ్‌ 11 గంటల వరకు 40.48 శాతానికి చేరింది. మధ్యాహ్నం ఒం టిగంట వరకు 60.99 శాతం, 3గంట ల వరకు 72.98 శాతం, పోలింగ్‌ ముగిసే సమయానికి 81.73 శాతంగా నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలకు బ్యాలెట్‌ బాక్సులనుతరలించారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ, ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్యే పెద్ది
జిల్లాలోని ఆత్మకూరు మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని, చెన్నారావుపేటలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు బీ శ్రీనివాస్‌ పరిశీలించారు. నెక్కొండ పోలింగ్‌ కేంద్రంతోపాటు చెన్నారావుపేట, జల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని, గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, కొమ్మాల, నందనాయక్‌తండాల్లోని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఎం హరిత పరిశీలించి పోలింగ్‌ సరళి, ఏర్పాట్లను పరిశీలించారు. అ నంతరం ఏర్పాట్లపై ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భం గా పోలింగ్‌ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ గీసుకొండ మండలకేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. చెన్నారావుపేట పోలింగ్‌ కేంద్రంతోపాటు పలు సమస్యాత్మక గ్రామాల్లో డీసీపీ కేఆర్‌ నాగరాజు పరిశీలించారు. పరకాల పోలీసు డివిజన్‌ పరిధిలోని ఆత్మకూరు మండలకేంద్రంలోని పో లింగ్‌ను పరకాల ఏసీపీ వైవీఎస్‌ సుధీంద్ర పరిశీలించగా నెక్కొండ మండలంలోని పో లింగ్‌ కేంద్రాలను నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ సందర్శించారు. నెక్కొండ మండలంలో ఓటింగ్‌ సరళిని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి అడిగి తెలుసుకున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...