గ్రామాల్లో పోలింగ్‌ సరళి పరిశీలన


Wed,May 15, 2019 03:14 AM

చెన్నారావుపేట : గ్రామాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలించారు. మంగళవారం ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. అమీనాబాద్‌, అక్కల్‌చెడ, కోనాపురం, లింగాపురం, ఉప్పరపల్లి గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం పోలింగ్‌ సరళి ఏవిధంగా ఉందని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీని కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ అభ్యర్థి బానోత్‌ పత్తినాయక్‌, కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధికార ప్రతినిధి బాల్నె వెంకన్న, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, టీఆర్‌ఎస్‌ ఖానాపురం మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, నాయకులు అమ్మ రాజేశ్‌, మురహరి రవి, కడారి సాయిలు, మేడి రాజ్‌కుమార్‌, పత్తినాయక్‌తండా సర్పంచ్‌ జాటోతు స్వామి, దారావతు రాములు, బానోతు రాంజీ, బుర్రి యాదగిరి, ఎంపీటీసీ అభ్యర్థులు కడారి సునీత, చెరుకుపెల్లి విజేందర్‌రెడ్డి, గుండాల మహేందర్‌, పసునూటి రమేశ్‌ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...